ఈ బయ్యారంలో నిర్వహించే జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతమే లక్ష్యం

ఈ బయ్యారంలో నిర్వహించే జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతమే లక్ష్యం
- సమిష్టిగా శ్రమిస్తున్న అధికారులు, ఎస్జీఎఫ్ సిబ్బంది
పినపాక

పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–17 బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.
పాఠశాలల క్రీడాసమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్, ఎంపీడీవో సంకీర్త్, తహసిల్దార్ గోపాలకృష్ణ,పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎంఈవో కొమరం నాగయ్య, ఏడూళ్ల బయ్యారం ఇంచార్జి హెచ్‌ఎం తిరుపతి రెడ్డి, పీడీ వీరన్న, పంచాయతీ కార్యదర్శులు జయపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు రోజువారీగా పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ చేపడుతున్నారు.
క్రీడాకారుల వసతి, భోజనం, రవాణా, భద్రతతో పాటు పోటీ వేదికల సిద్ధత, మైదానాల నిర్వహణ, వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు అమలు చేస్తున్నారు.
అదేవిధంగా న్యాయనిర్ణేతలు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందితో సమన్వయం కొనసాగిస్తూ పోటీలు సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. క్రీడాస్ఫూర్తి,న్యాయసమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ పోటీలు నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727