అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు తప్పనిసరిగా తెలపాలి— ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు

పినపాక మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు అందరూ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల వివరాలు, వ్యయ నిర్వహణ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్స్‌ను ఈ నెల 29వ తేదీలోగా ఎంపీడీవో కార్యాలయం, పినపాకలో సమర్పించాలని ఆయన సూచించారు.
సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి వినియోగించిన వాహనాలు, మైకులు, ర్యాలీలు తదితరాలకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా స్పష్టంగా తెలపాలని అన్నారు. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించని పక్షంలో, సంబంధిత అభ్యర్థులు ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని హెచ్చరించారు.
కావున, అభ్యర్థులందరూ నిబంధనలను పాటిస్తూ సకాలంలో సరైన ధ్రువపత్రాలతో కూడిన ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలని ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727