పునరావాసం అంటే సంపూర్ణ జీవన వ్యవస్థ : జిల్లా కలెక్టర్: బాదావత్ సంతోష్

అమ్రాబాద్, గ్రామాలపునరావాసం పారదర్శకంగా పూర్తి చేయాలి....పునరావాసం అంటే సంపూర్ణ జీవన వ్యవస్థ 
: జిల్లా కలెక్టర్: బాదావత్ సంతోష్
నాగర్‌కర్నూలు, డిసెంబర్ 23(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశానికితలమానికంగానిలుస్తోందని, దాని ప్రత్యేకతను కాపాడుకుంటూనే రిజర్వ్ పరిధిలోని తరలింపు గ్రామాల పునరావాసం,పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిగాపారదర్శకంగాఅమలుచేయాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కేంద్రం లోవీడియో కాన్ఫరెన్స్ మందిరంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలపునరావాస–పునర్నివాస ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర పాల్గొన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొల్లంపెంట, సా ర్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండా ల పెంట గ్రామాల ప్రజలనుపునరావాసకేంద్రాలకుతరలించేందుకుచేపడుతున్న చర్యలపై కలెక్టర్,సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్,మాట్లాడుతూ గ్రామాల తరలింపు ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్‌టీసీఏ(NTCA) నిబంధనల ప్రకారం నిర్ణీతకాలపరిమితిలో పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. గ్రామాల పునరావాసంనిమిత్తం అచ్చంపేట డివిజన్, లింగాల్ మండలంలోని బాకారం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1501.88 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇన్-ప్రిన్సిపల్ (స్టేజ్–II) అనుమతి లభించినట్లు తెలిపారు. దీంతో పునరావాస కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి మార్గం సుగమమైందన్నారు.
పునరావాసం అంటే కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాదని, సంపూర్ణ జీవన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పునరావాస ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
160 మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.15 లక్షల పరిహారానికి సంబంధించి వెంటనే జాయింట్ బ్యాంకు ఖాతాలు తెరవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌కు సూచించారు. ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని రెవెన్యూ పట్టాలతో అందించనున్నట్లు, ఆ భూమి విక్రయానికి 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని తెలిపారు.
సార్లపల్లి సర్పంచ్ రాములు గ్రామ ప్రజలకు సంబంధించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో ఎన్జీవో ఇమ్రాన్ సిద్ధికి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727