ప్రజాపంధా అభ్యర్థులను గెలిపించండి

గుండాల మండలం డిసెంబర్ 10 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

ఈనెల 17వ తారీకు జరగనున్న ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు చండ్ర అరుణ మాచర్ల సత్యం కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఈసం శ్రీను శంకరన్న మాట్లాడుతూ గతంలో పనిచేసిన పార్టీ ప్రజాప్రతినిధులు కామ్రేడ్ బాటన్న గుమ్మడి నరసయ్య గారి స్ఫూర్తితో నిజాయితీగా ప్రజా అభివృద్ధి కోసం పనిచేస్తానని వారన్నారు కాలక్రమంగా రాజకీయాలు వ్యాపారాలుగా మారుతున్నాయని ఎన్నికల్లో ధన ప్రవాహం డబ్బు తొ పాటు అనేక ప్రలోభాలు శాసిస్తున్నాయని ఇటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీలకు బాధితులకు అండగా నిలబడి కొట్లాడే ప్రజాపంధ పార్టీ అభ్యర్థులను ఆదరించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించి తగు మద్దతును ఇవ్వాలని వారు మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు పోడు భూములు కొట్టించిన ఘనత ప్రజాపందా పార్టీ దేనని అనేక చెరువులను కుంటలను పోయించి బీడు భూములను సశ్యశ్యామలం చేశామని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి తలలో నాలుకలాగా ఉన్నామని స్పష్టం చేశారు ఇంకా గుండాల మండలంలో అనేక ఇరిగేషన్ సమస్యలు ఉన్నాయని మండలంలో బస్టాండ్ ఏర్పాటు ఆసుపత్రిని ముప్పై పడకలుగా మార్చడం డయాలసిస్ సెంటర్ లైబ్రరీ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజాపంధ గుండాల పంచాయితీ అభ్యర్థి కామ్రేడ్ ఈసం శ్రీను (శంకరన్న) ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డులలో పోటీలో ఉన్న ప్రజాపంధ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రజాపంధా అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ గుండాల మండల కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించడం యూత్ మద్దతు హర్షనీయమని వారన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు డివిజన్ కార్యదర్శి శంకరన్న గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య ఊకే బాబు తోలెం సాంబయ్య ఇల్లందుల అప్పారావు పూణేం లక్ష్మన్న ఇల్లందుల నరసింహులు ఈసం చంద్రన్న తెల్లం రాజు కే జగన్ అరెం రాంబాయి యూత్ నాయకులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727