బాంబు పేలి కుక్క మృతి – కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం


కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాల్లో బుధవారం చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైల్వే ట్రాక్ వద్ద పడిఉన్న నాటు బాంబును కుక్క ప్రమాదవశాత్తూ కొరకడంతో అది పేలి కుక్క మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర శబ్దంతో బాంబు పేలిన వెంటనే పరిసరాలన్నీ ఒక్కసారిగా సంచలనం ఏర్పడింది. ట్రాక్‌పై ఏదో తినే ఆహారం గా భావించి కుక్క ఆ బాంబును కొరకగా వెంటనే పేలుడు సంభవించి అది అక్కడికక్కడే మరణించింది.

ఈ సంఘటనతో కొత్తగూడెం నల్లిబొడ్డులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే ట్రాక్‌పై పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? ఎవరు ఉంచారు? ఏ ఉద్దేశంతో ఉంచారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్త తెలిసిన వెంటనే పోలీసులు, రైల్వే భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ బాంబు ఎలా అక్కడికెళ్లిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇలాంటి పేలుడు పదార్థాలు పక్కనే ఉన్న రోడ్లు, కాలనీలు, రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. స్థానికులు రైల్వే ప్రాంతాల్లో భద్రత మరింత కఠినంగా ఉండాలని, అపరిచిత వస్తువులు కనిపించిన వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727