శ్రీ ఉమా మహేశ్వర ఆలయం అభివృద్ది కి హైదరాబాద్ భక్తుని భారీ విరాళం(1,12,000)

నాగర్ కర్నూల్,నవంబర్ 06,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి లోని రంగా పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వయంభూ దేవుడిగా నల్ల మల కొండల లో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ శ్రీశైలానికి ఉత్తర ముఖ ద్వారంగా వెలసి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానఅభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన అరవపల్లి లక్ష్మీ నరసింహం, వారి కుటుంబ సభ్యులు శనివారం ₹1,12,000లను నగదు రూపం లో విరాళంగాఅందజేశారు. ఈవిరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బీరం. మాధవ రెడ్డికి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా అందించారు.
విరాళం అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా గణపతి పూజ,కుంకుమార్చన, అభిషేకం నిర్వహించి వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందజేశారు. తదుపరి వారికి స్వామివారి శేష వస్త్రంతో ఘన సన్మానం చేశారు. ఇలాగే ఆలయ అభివృద్ధి లో భాగంగా సహాయం చేస్తున్న ప్రతి భక్తుని కుటుంబ సభ్యుల పై స్వామి వారి కృప ఉండాలని వారిని అష్ట ఐశ్వర్యాల తో సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యా లతో దీవించాలని అభివృద్ధి లో భాగమైన భక్తుల కోరికలు నెరవేరేలా ఆ ఉమామహేశ్వరుని దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఛైర్మన్ మాధవ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727