అశ్వాపురంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం

స్వాతంత్ర్య భారత్ న్యూస్ అశ్వాపురం ప్రతినిధి.    , నవంబర్ 21, 2025:
అశ్వాపురం మండలంలోని పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ అశ్వాపురం పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యోగితా వేణి సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సైన్స్‌పై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిలవాలని సూచించారు. విజేతలకు మండల స్థాయి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.

ఇంగ్లీష్ మీడియం – మొదటి స్థానం:
పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ అశ్వాపురం నుంచి బి. లహరి, ఎన్. వినీల, ఇ. వెంకటేష్ గ్రూప్ విజేతలుగా నిలిచారు.

తెలుగు మీడియం – మొదటి స్థానం:
జడ్పీహెచ్ఎస్ మల్లెలమడుగు పాఠశాలకి చెందిన జె. సాకేత్, కె. జస్వంత్, జి. వెంకట పవన్ గ్రూప్ ప్రథమ స్థానాన్ని సాధించింది.

ఇంగ్లీష్ మీడియం – రెండవ స్థానం:
జడ్పీహెచ్ఎస్ మల్లెలమడుగు నుంచి బి. సుజనశ్రీ, డి. రేహాంతి, డి. అభినయ్ గ్రూప్ ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం, గొందిగూడెం, మెట్టగూడెం, సీతారాంపురం, మల్లెలమడుగు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727