ఎక్సలెంట్ భాషా హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఎక్సలెంట్ బాషా హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పినపాక

 పినపాక మండలం, ఇ.బయ్యారం క్రాస్-రోడ్:
ఎక్సలెంట్ బాషా హైస్కూల్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవ ప్రధాన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకలను ఉద్దేశించి ఛైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక–మానసిక శక్తిని పెంపొందిస్తాయన్నారు. పోటీ భావన, ఐక్యత, క్రమశిక్షణను అభివృద్ధి చేస్తాయన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. విశిష్ట అతిథులైన మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ పి. సురేష్, కరకగూడెం సబ్ ఇన్స్పెక్టర్ పి.వి.ఎన్.రావు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఉన్నత భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఆరు రోజుల పాటు సీనియర్–జూనియర్ విభాగాల్లో నిర్వహించిన కబడ్డీ, డ్రాయింగ్, లెమన్ & స్పూన్, పరుగు పందెం తదితర పోటీల్లో విజేతలకు అతిథుల చేత బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యూసఫ్ షరీఫ్, యాకుబ్ షరీఫ్, ఎం.వి. నర్సారెడ్డి, నరేంద్ర, సురేష్, ఇంఛార్జ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727