పాతాల గంగ లో జారిపోయి మృతి చెందిన ఓ భక్తుడు

పాతాల గంగ లో జారిపోయి మృతి చెందిన ఓ భక్తుడు 

నాగర్ కర్నూల్,నవంబర్,28(ఎస్ బి న్యూస్),: కర్నూల్ జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు పాతాళగంగ వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి దుర్మరణంపాలయినఘటన జరిగింది. ఈ విషాదకర ఘటనశుక్రవారంఉదయంఈగలపెంటలోచోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామానికి చెందిన కురుమయాదయ్య (45)తనస్నేహితులురమేష్,అఫ్రజ్‌లతో కలిసి నవంబర్ 27నశ్రీశైలంయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలంమన్ననూర్ వద్ద గురు వారం రాత్రి బస చేసిన వీరు,శుక్రవారం ఉదయం శ్రీశైల దర్శనానికి వెళ్లే ముందుపాతాళగంగ వద్ద స్నానం చేయడానికి గంగ లోకి దిగారు.
సుమారు ఉదయం 8 గంటల సమయంలో స్నానం చేస్తుండగా యాదయ్య(45) ప్రమాదవశాత్తూ లోతుకు వెళ్లి నీటిలోమునిగిపోయారు.స్నేహితులు గమనించికాపాడేలోపేఆయనప్రాణాలు కోల్పోయారు. యాదయ్య మృతి పట్లకుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు.

యాదయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈగలపెంట ఎస్ఐ జయన్న కేసు నమోదు చేసి, ఇది ప్రమాదవశాత్తు మృతిగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727