సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 


SBNEWS: సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సీమఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో పినపాక మండలానికి చెందిన పలువురు సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా  మంజూరైన చెక్కులను అందజేశామని తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, ఏపీవో వీరభద్రస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం,వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేషనల్ కబడ్డీ నిర్వహణపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే 



SBNEWS: నేషనల్ కబడ్డీ క్రీడల నిర్వహణకు  పినపాక మండల పరిధిలో గల ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల  ఎంపిక కావటం గర్వకారణమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్ పరిశీలించి అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. జాతీయస్థాయి క్రీడలు కావున ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉడుముల లక్ష్మీరెడ్డి, జెసిబి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు సాంబ, పిడి వీరన్న, పూర్వ విద్యార్థుల తోట గంగాధర్, శ్రీరామ్ బృహస్పతి, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727