భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ముందున్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతినగా వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న కారును ఇన్సూరెన్స్ ప్రక్రియ కోసం అక్కడే ఉంచారు. అనంతరం పోలీసులు వేణుగోపాల్‌కు అల్పాహారం ఏర్పాటు చేయగా, సివిల్ సప్లైస్ అధికారి కారులో ఆయన కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు.
Tags
నార్కట్‌పల్లి