కొత్తగుంపులో తీరిన కరెంటు కష్టాలురూ.3.50 లక్షల వ్యయంతో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం


పినపాక మండలంలోని జానంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తగుంపు గ్రామ ప్రజలకు నెలలుగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. సుమారు రూ.3,50,000 అంచనా వ్యయంతో చేపట్టిన విద్యుత్ పనులు పూర్తి చేసి, మంగళవారం నుండి 24 గంటల కరెంట్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డి.ఇ జీవన్ కుమార్, ఏ.ఈ వేణుగోపాల్ పాల్గొని జానంపేట సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి, ఉపసర్పంచ్ దాట్ల రాజేష్ ఆధ్వర్యంలో కొత్త కనెక్షన్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అంతరాయ సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు అధికారులు అభినందనలు అందుకున్నారు.
ఈ సందర్భంగా డి.ఇ జీవన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా బాట – పొలం బాట” కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రైతులు విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా శాఖ అధికారులను సంప్రదించాలని, స్వయంగా లైన్ల జోలికి వెళ్లవద్దని సూచించారు. వ్యవసాయ మోటార్లకు ప్లాస్టిక్ స్టార్టర్లు, సురక్షిత బాక్సులు వినియోగించాలని సూచించారు.
కొత్తగుంపులో 24 గంటల విద్యుత్ అందించడంలో సమన్వయంతో పనిచేసిన ఏ.ఈ వేణుగోపాల్‌ను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ వీరారెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ అహ్మద్, ఏఎల్ఎం మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, ఆవుల సునీల్, జరుపుల రాము, అత్తి లక్ష్మీనారాయణ, జానంపేట వార్డు సభ్యులు పాటిబండ్ల సత్యనారాయణ, పోలిశెట్టి హరీష్, పొనుగోటి చందర్ రావు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727